★ద్విచక్ర వాహనలకు నెంబర్ ప్లేట్స్ లేకుంటే వాహనాలు సీజ్ చేస్తాం
★గంజాయి మత్తు పదార్థాలు అమ్మే వారిపై కఠిన చర్యలు
రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) జూలై 15:- మెదక్ జిల్లా రామాయంపేట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన శాంతి కమిటీ సమావేశంలో రామాయంపేట సిఐ.వెంకట రాజా గౌడ్ మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయని ప్రజలు జాగ్రత్తగా ఉంటే సైబర్ నేరాలను అరికట్ట వచ్చన్నారు. ఆన్లైన్లో మీకు డబ్బులు వచ్చాయి చూసుకోండి మీ అకౌంట్ కు సీక్రెట్ ఓటిపి నెంబర్ వచ్చింది చెప్పండి అంటూ సైబర్ నేరగాళ్లు కొత్త దారిలో దోచుకుంటున్నారని తెలిపారు. అకౌంట్లో డబ్బులు పడతాయి అన్న ఆశకు పోకుండా ఆ నెంబర్లను లిఫ్ట్ చేయొద్దని పేర్కొన్నారు.ఆన్లైన్ లో బెట్టింగ్లు గంజాయి లాంటి మత్తు పదార్థాలకు యువత పెడతోవా పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.మట్కా మారకద్రవ్యాలు గంజాయి లాంటి పదార్థాలు ఎవరైనా ఎక్కడైనా అమ్ముతుంటే వెంటనే తమకు సమాచారం అందించాలని కోరారు. ప్రజలు ట్రాఫిక్ రూల్స్ ను తప్పక పాటించాలన్నారు లేకుంటే ప్రాణాలు గాలిలో కలిసి పోతాయన్నారు.హెల్మెట్ ధరించడం త్రిబుల్ రైడింగ్ డ్రింక్ అండ్ డ్రైవ్ ఇలాంటి ప్రయాణాలు చేయొద్దని ఇలా చేయడం వల్ల ప్రాణాలు పోయే ప్రమాదం ఉందన్నారు. అతివేగంతో నడిపే వారికే కాకుండా అన్నం పుణ్యం ఎరుగని బాటసారి కూడా బలైతారని అతివేగంగా వాహనాలు నడపొద్దని తెలిపారు.రామాయంపేట మండలంలో నంబర్ ప్లేట్స్ లేని ద్విచక్ర వాహనాలు ఎవరైనా నడిపినట్లు అయితే అవి వెంటనే సీజ్ చేస్తామని తెలిపారు.ద్విచక్ర వాహనాలు నడిపే యువకులు 18 సంవత్సరాలు పైబడిన వారు మాత్రమే వాహనాలు నడపాలని లేనియెడల తల్లిదండ్రులు యువతకు వాహనాలు ఇవ్వరాదని సూచించారు.ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సి కలిగి తప్పకుండా హెల్మెట్ ధరించాలని లేనియెడల జరిమానా విధించడం జరుగుతుందన్నారు.ఇలాంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు.