రామాయంపేట (నేటి గధర్ ప్రతినిధి) జూలై 15:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్లో సోమవారం సాయంత్రం రామాయంపేట సిఐ.వెంకట రాజా గౌడ్ ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 17న మొహరం, తొలి ఏకాదశి పండుగలు ఒకే రోజు రావడంతో ఈ పండుగలలో ప్రజలు ఎలాంటి అల్లర్లకు పాల్పడకుండా ప్రశాంతమైన వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని ఆయన పేర్కొన్నారు.ఈ పండుగలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అల్లర్లకు ఎవరైనా పాల్పడితే వారిపై చట్టరీత్య చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. కాబట్టి ఈ పండుగలు ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు ప్రజలు పాల్గొన్నారు.
Post Views: 26