ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ పుష్ప: ది రూల్’. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీస్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ రూ. 400కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంటోంది. డిసెంబర్ 6న ఈ మూవీ విడుదల కానుంది.
అయితే ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నారనే చర్చ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో జరుగుతోంది. త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగాలతో కొత్త సినిమాలకు అల్లు అర్జున్ ఆల్రెడీ కమిట్ అయినప్పటికీ ఈ సినిమాలు సెట్స్ పైకి వెళ్లడానికి చాలా సమయం ఉంది. ఈలోగా మరో దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా చేయాలని అనుకుంటున్నారట. దీంతో ఆయన తర్వాతి సినిమా దర్శకుల జాబితాలో అట్లీ, బోయపాటి శీను, సురేందర్ రెడ్డి వంటి పేర్లు వినిపించాయి.
రజనీకాంత్ తో ‘జైలర్’ తీసి బ్లాక్ బస్టర్ అందుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ మూవీ తెరకెక్కనుందనే టాక్ తాజాగా తెరపైకి వచ్చింది. దీంతో నెల్సన్ తో అల్లు అర్జున్ ఓ సినిమా చేసే అవకాశాలున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల నెల్సన్ చెప్పిన స్టోరీ అల్లు అర్జున్ కు నచ్చిందని సమాచారం. పూర్తి స్క్రిప్ట్ సిద్దం చేయాలని డైరెక్టర్ కు బన్నీ చెప్పినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ కథకు తుది మెరుగులుదిద్దే పనిలో నెల్సన్ ఉన్నారట. అనుకున్నట్లు జరిగితే అల్లు అర్జున్, నెల్సన్ దిలీప్ కాంబినేషన్ లో మరో హిట్ ఉంటుందని టాక్. ఈ ఏడాది చివరిలోగా అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.