+91 95819 05907

డ్రగ్స్ కేసులో రకుల్ తమ్ముడు అరెస్టు..

ఎన్ని చర్యలు చేపట్టినా ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడడాన్ని మాత్రం నివారించలేకపోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కుదరడం లేదని, సెలబ్రిటీలు బెంగుళూరుకు వెళ్లి మరీ డ్రగ్స్ తీసుకుంటున్నారు. మొన్నటికి మొన్న బెంగుళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటూ టాలీవుడ్ ప్రముఖులు దొరికిన విషయం తెల్సిందే. అందులో నటి హేమ కూడా ఉండడంతో ఆమెను కూడా పోలీసులు అరెస్ట్ చేసారు.

 

ఇక ఆ ఘటనను మరువకముందే.. డ్రగ్స్ సరఫరా చేస్తూ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ అరెస్ట్ అవ్వడం ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. తాజాగా సైబరాబాద్ పోలీసులు హైదరాబాద్ లో డ్రగ్స్ ను పట్టుకున్నారు. కొకైన్ ను సరఫరా చేస్తూ.. నలుగురు నైజీరియన్లతో పాటు రకుల్ తమ్ముడు అమన్ కూడా పోలీసులకు దొరికాడు.

 

వెంటనే పోలీసులు ఈ ఐదుగురును అరెస్ట్ చేసి వారి వద్ద ఉన్న 200 గ్రాములకు పైగా కొకైన్ ని స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే అమన్.. డ్రగ్స్ సేవిస్తూ కనిపించినట్లు తెలుస్తోంది. దీంతో అతనిని రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అమన్ తో పాటు దీని వెనుక చాలామంది ప్రముఖులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చాలామంది సెలబ్రిటీస్ కు వీరితో సంబంధం ఉందని అనుమానిస్తున్నారు.

 

తమ్ముడే కాదు రకుల్ కూడా గతంలో డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కున్న విషయం తెల్సిందే. గతంలో ఆమె డ్రగ్స్ కేసులో విచారణకు కూడా హాజరయ్యింది. అయితే ఒక రాజకీయ నేత అధికారంలో ఉండడంతో ఆమె బయటపడింది. ఇప్పుడు ఆమె తమ్ముడు. సైతం డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు. మరి ఈ విషయమై రకుల్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

చింతకానిలో ఘనంగా కట్ట మైసమ్మ తల్లి మొక్కులు చెల్లించుకున్న ముదిరాజులు.

చింతకానిలో ఘనంగా కట్ట మైసమ్మ తల్లి మొక్కులు చెల్లించుకున్న ముదిరాజులు. నేటి గదర్ న్యూస్ చింతకాని ప్రతినిధి : ఉమ్మడి ఖమ్మం జిల్లా చింతకాని మండల పరిధిలోని స్థానిక నల్లచెరువుపై కొలువుతీరి ఉన్న కట్టమైసమ్మ

Read More »

తెలంగాణ రాష్ట్రంలో దుబారా మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ

ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. బిజెపి మండల అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి డిమాండ్. నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చి 17. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో బిజెపి

Read More »

మాసాయిపేట రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం

** పాల్గొన్న పలు గ్రామాల రైతులు నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చి 17. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో మంగళవారం నాడు మాసాయిపేటలో గల రైతు వేదిక

Read More »

సర్పంచ్ ల సంఘం నూతన అధ్యక్షులుగా సోలం కేశవరావు.

నేటి గదర్‌ కరకగూడెం: కరకగూడెం మండలం సర్పంచుల సంఘం నూతన అధ్యక్షులుగా వెంకటాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ సోలం కేశవరావు, ఉపాధ్యక్షులుగా కన్నాయిగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ కల్తీ. విజయ్ కుమార్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ

Read More »

విద్యార్థుల అభివృద్ధికి ఆత్మ బలమే ఆలంబన.

*డాక్టర్ ఎస్ సారంగపాణి విశ్రాంత ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్* *డాక్టర్ సారంగాపాని సేవలు అభినందనీయం మండల విద్యాశాఖ అధికారి గడ్డం.మంజుల* *పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్ మరియు షూ పంపిణీ* నేటి గదర్

Read More »

ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు తుంగలో తొక్కుతున్న సీఎం

. *పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం* *జీతాలు పెంచంటే అరెస్టులు చేస్తారా?* నేటి గదర్‌ కరకగూడెం: అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు తాము అధికారంలోకి వస్తే వేతనాలు పెంచుతామని 26 వేల రూపాయలు జీతం ఇస్తామని

Read More »

 Don't Miss this News !