తెలంగాణలో రైతు రుణమాఫీకి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. భూమి ఉన్న ప్రతీ రైతు కుటుంబానికి రూ. 2 లక్షల రుణమాఫీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే రేషన్ కార్టు డేటాబేస్ ఆధారంగా అర్హులను గుర్తించనున్నారు. 2018 డిసెంబర్ 12వ తేదీ నుంచి 2023 డిసెంబర్ 13 వరకు తీసుకున్న పంట రుణాల బకాయిలకు మాత్రమే ఈ రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది.
పంట రుణమాఫీ కోసం ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేయనున్నారు. రుణమాఫీ నగదు నేరుగా లబ్ధిదారుల రుణ ఖాతాల్లోనే జమ అవుతుంది. ఆరోహణ క్రమంలో రుణమాఫీ విడుదల చేస్తారు. ఎన్‌హెచ్‌జీ, జేఎల్‌జీ, ఆర్ఎంజీ, ఎల్ఈసీఎస్ రుణాలకు, రీషెడ్యూల్ చేసిన రుణాలకు రైతు రుణమాఫీ వర్తించదు. రుణమాఫీపై రైతులకు సందేహాలు తీర్చేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అంతే కాకుండా రైతు సమస్యలు ఉంటే 30 రోజుల్లో పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చింది. మరిన్ని వివరాకు పోర్టల్ కూడా చూడొచ్చు. లేదా మండల సహాయ కేంద్రాను కూడా సంప్రదించవచ్చు.
పథకం అమలుకు ఏర్పాట్లు..
వ్యవసాయశాఖ సంచాలకులు, ఎస్ఐసి సంయుక్తంగా ఈ పథకం అమలు కోసం ఒక ఐటి పోర్టల్ నిర్వహించనున్నారు. ఈ ఐటీ పోర్టల్‌లో ప్రతి రైతు కుటుంబానికి సంబంధించిన లోన్ అకౌంట్ డేటా సేకరణ, డేటా వాలిడేషన్, అర్హత మొత్తాన్ని నిర్ణయించడానికి సౌకర్యం ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది.
ప్రభుత్వం పేర్కొన్న మరికొన్ని విషయాలు..