నేటి గదర్ న్యూస్, ఖమ్మం ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం లో డ్రగ్స్ సరఫరా మరియు వినియోగాన్ని సమూలంగా నిర్మూలించడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడంతో పాటు, సమాచార వ్యవస్థను మరింత భలోపేతం చేస్తున్నట్లు సీపీ సునీల్ దత్ నిన్న తెలిపారు. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగం నియంత్రణపై ఈ బృందాలు ప్రత్యేకంగా నిరంతరం పనిచేస్తాయని చెప్పారు. డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాల పై సమాచారం ను 8712659123 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం అందజేసిన వారి వివరాలకు గోప్యంగా ఉంచుతామని సీపీ సునీల్ దత్ అన్నారు. మత్తు పదార్థాల వినియోగంతో కుటుంబాలు చిన్న భిన్న మవుతున్నాయి అన్నారు.ఖమ్మం ప్రజానీకం ప్రతి ఒక్కరు తమ వంతు భాద్యతగా ఈ డ్రగ్స్ కు వ్యతిరేకంగా నడుంబిగించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో డీయాస్పి లు, సి ఐ లు, పోలీస్ ఇన్స్పెక్టర్ లు పాల్గొన్నారు.