★ఈ రహదారికి మోక్షం ఎప్పుడు
★అధికారులు మారి పాలకులు మారిన ఈ రహదారికి మోక్షం కలగడం లేదు
నేటి గద్దర్ కరకగూడెం:మండల పరిధిలోని బట్టుపల్లి గ్రామపంచాయితిలో గల లక్ష్మీపూరం గ్రామంలోని రహదారిపై వర్షం పడుతే అ రోడ్డు పై నాటు ఎయ్యవచ్చు అన్ని అ గ్రామస్తులు అంటున్నారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం బట్టుపల్లి గ్రామ అర్అండ్ బి రహదారి నుండి లక్ష్మీపూరం గ్రామంలోని వాగు బ్రిడ్జి వరకు ఉన్న రహదారి ఎంతమంది పాలకులు మారిన అధికారులు మారిన ఎన్ని వినతిపత్రలు ఇచ్చిన ఈ రోడ్డు కి మోక్షం కలగడం లేదనీ తెలిపారు.రోడ్డు బురదగా ఉండటంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.ప్రజలు ఇంత ఇబ్బందులు పడితున్న గ్రామపంచాయతి అధికారులు మాత్రం ఇటువైపు కన్నెత్తి చూడటం లేదనీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ రోడ్డు కి గ్రావెల్ రోడ్డు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.









