నేటి గదర్ న్యూస్, ఖమ్మం ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు.రేషన్ కార్డ్స్ కోసం ఎదురు చూసే వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రేపు అనగా అక్టోబరు 2వ తేదీ బుధవారం నుంచి నూతన రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించనుంది.తెలంగాణ రాష్ట్రాల్లో గ్రామీణ, అర్బన్ ఏరియాలుగా వార్షికాదాయ పరిమితిని అమలు చేస్తున్నారు. దీని ఆధారంగానే తెల్ల రేషన్కార్డును ప్రభుత్వాలు ఇస్తున్నాయి. గ్రామీణ ప్రాంతంలో రూ.1.50 లక్షలు, అర్బన్ రూ.2 లక్షల్లోపు ఆదాయాన్ని కార్డుల జారీకీ ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. భూ విస్తీర్ణం తరి భూమి అయితే 3.5 ఎకరాలు, మాగాణి భూమి అయితే 7.5 ఎకరాలలోపు ఉండాలనే నిబంధనలు అమలు చేస్తున్నారు.
Post Views: 37