+91 95819 05907

ఆజామ్ జాహి మిల్లు వస్త్ర పరిశ్రమకు చెందిన భూములపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి:భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు)

ఆజామ్ జాహి మిల్లు
వస్త్ర పరిశ్రమకు చెందిన భూములపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి:భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు)

జయశంకర్-మహబూబాబాద్-వరంగల్(2)-పెద్దపల్లి (JMWP)

డివిజన్ కమిటీ వెంకటేష్ పేరున మావోయిస్టు పార్టీ లేఖ విడుదల

◆226 ఎకరాల భూమి దురాక్రమణకు గురి అయింది

నేటి గదర్ వెబ్ డెస్క్:

ఆజామ్ జాహి మిల్లు
వస్త్ర పరిశ్రమకు చెందిన భూములపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి. ప్రస్తుత స్థలంలో కార్మికుల భవనాన్ని నిర్మించి ఇవ్వాలి. భూములపై పూర్తి హక్కు కార్మికులకు లేదా వారి కుటుంబాలకు దక్కే వరకు విరోచిత పోరాటాలు చేపట్టండి. ప్రజలు, పత్రికా మిత్రులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు కార్మికుల పోరాటాలకు సంపూర్ణ మద్దతును తెలుపండి.

వరంగల్ నగరంలో ఏడు దశాబ్దాల క్రితం ఆజామ్ జాహి వస్త్ర పరిశ్రమను నిజాం కాలంలో స్థాపించారు. ఈ పరిశ్రమపై ఆధారపడి వేలాది మంది కార్మికులు, ప్రజలు జీవించారు. నేడు మన దేశంలో సామ్రాజ్యవాదుల, దళారీ నిరంకుశ బూర్జువా వర్గాల దోపిడి ప్రయోజనాల కోసం 1991లో నూతన ఆర్థిక విధానాలు చేపట్టి నుండి ప్రభుత్వాలు వస్త్ర పరిశ్రమను ఒక పథకం ప్రకారం నిర్లక్ష్యం చేస్తూ పరిశ్రమ దివాళా తీసేలా చేశారు. 451 మంది కార్మికులకు బలవంతపు VIRS ఇచ్చి 2002లో మిల్లును మూసివేశారు. ఫలితంగా కార్మికులు రోడ్డున పడ్డారు. మూసివేసిన నాటి నుండి నేటి వరకు పరిశ్రమను తిరిగి స్థాపించాలని పోరాడుతూనే వున్నారు. కార్మికుల పోరాటాన్ని పెడ చెవిన పెట్టి 2007లో కాంగ్రెస్ ప్రభుత్వం కుడా సంస్థకు 117 ఎకరాల 20 గుంటలు, ఆంధ్ర ప్రదేశ్ హౌజింగ్ బోర్డుకు 65 ఎకరాలు, రాంకీ, హ్యూండ్లూమ్ కార్పోరేషన్ సంస్థకు 30 ఎకరాల భములను అమ్మేసింది, ఈ సంస్థలు కార్మికుల ప్రయోజనాల కోసం, భూములను పరిరక్షించకుండా ప్రైవేటీ వ్యక్తులకు అమ్మకాల పెట్టాయి. దీనితో కార్మికులకు తీవ్రమైన అన్యాయం జరిగింది. పరిశ్రమకు సంబంధించిన భూమి 226 ఎకరాల భూమిపై న్యాయబద్ధంగా తమకే చెందాలని, ఆ భూములపై కార్మికులకే హక్కు వుండాలిని కార్మికులంతా పోరాడుతూనే వున్నారు. ప్రభుత్వ అధికారుల చుట్టూ ఏండ్ల తరబడి తిరిగిన్నారు. అయినప్పటికీ ఈ భూములను కార్మికులకు ఇవ్వకుండా కార్పోరేషన్ సంస్థలకు వేలం వేశారు. కార్పోరేషన్ సంస్థలకు అమ్మగా మిగులిన భూములను దోపిడి వర్గాలు, రాజకీయ నాయకులు తమ వ్యాపార ప్రయోజనాల కోసం ప్రభుత్వాల ప్రోద్భలంతో, కొద్దిమంది కార్మిక నాయకుల మద్దతుతో ఓం నమశిమాయ, గొట్టే ముక్కుల నరెందర్ లాంటి కబ్జాదారులు సంబంధిత భూములను కబ్జా చేశారు. కబ్జా పెట్టిన భూములలో ఇండ్ల నిర్మాణాలు చేపట్టి వాటిని అమ్మకుని కోట్లు సంపాదిస్తున్నారు. ఆజామ్ జాహి మిల్లు కార్మికులంతా వారి రక్తాన్ని చెమటగా మార్చి పైసా పైసా కూడబెట్టుకొని వారి కష్ట సుకాలను మాట్లాడుకోవడానికి, తమ హక్కుల కోసం పోరాడడానికి ప్రధాన రహదారి ప్రక్కన వెంకటరామ థియేటర్ సమీపాన 12 గుంటల భూమిని కొనుగోలు చేసి కార్మిక భవనాన్ని నిర్మించుకున్నారు. అజాం జహి మిల్లు భూముల వ్యవహారం ఇంకా కోర్టులో వున్నప్పటికీ దానికి సంబంధించిన నియమాలను పట్టించుకోకుండా హైకోర్టు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్, వరంగల్ కు సుద్దాల నాగరాజులు తప్పుడు పత్రాలను సృష్టించి ఓం నమశివాయ అనే వ్యాపారికి అక్రమంగా అమ్ముకున్నారు. వీరి అండతో ఓం నమశివాయ అనే వ్యాపారి కార్మికుల కార్యలయాన్ని అన్యాయంగా కూల్చేశాడు. గతంలో గొట్టె ముక్కుల నరెందర్, ఓమ్ నమశివాయ కార్మికుల భవనాన్ని, భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేసినప్పడు చిక్కుడు ప్రభాకర్ కార్మికుల తరుపున కోర్టులో కేసు వేసి భవనాన్ని, భూములలో జోక్యం చేసుకునే వారిపై చట్ట రిత్యా చర్యలు తీసుకోవచ్చుని బోర్డు పెట్టించాడు. అజం బహి మిల్లును తిరిగి తెరిపించాలని కార్మికుల పక్షాన నిలిచి కార్మికోద్యమాలకు నాయకత్వం వహించాడు, నేడు అదే చిక్కుడు ప్రభాకర్ కార్మికులను మోసగించి దోపిడి వర్గాల పక్షం నిలబడుతున్నాడు. గొట్టె ముక్కుల నరెందర్ నుండి ఓం నమశివాయ కు కొలుగోలు చేసినట్లుగా తప్పుడు పత్రాలు సృష్టించాడు. ఆబం జహి మిల్లుకు సంబంధించిన భూములు, భవనానంతో పాటు విలువైన డ్యాక్ మెంట్లను అమ్ముకున్నారు. వరంగల్ కు చెందిన సుద్దాల నాగరాజు అసంఘటి కార్మిక సంఘం పేరుతో చలామణి అవుతూ తవడానికి అండిలేని స్థితి నుండి సెటిల్ మెంట్స్ మా అక్రమాలకు పాల్పడి అక్రమంగా ఆస్తులు సంపాదించాడు.

నీటి కాంగ్రెస్ ప్రభుత్వం అజాణజ భూముల కబ్జాదారులను శిక్షించకుండా వారి దోపిడీ ప్రయోజనాలకు కొమ్ముకొస్తున్నది. ఆనం మిల్లు భూములను ప్రవేటీ వ్యక్తులకు అమ్మకానికి ప్రయత్నిస్తున్నది. కాలకులు తమ భూమి కోసం చట్ట పరిధిలో న్యాయ. పోరాటం చేస్తున్న కార్మికులకు మొండి చెయి చూపి దోపిడి వర్గాలను అనుకూలంగా వ్యవహరించింది. పోలీసు స్టేషన్ లో కేసులు పెట్టడానికి వెళ్ళితే లంచాలు తీసుకున్న పోలీసులు •.మా పరిధిలో లేదని దబాయిస్తూ కేసులు పెట్టడం లేదు. ఫలితంగా 226 ఎకరాల భూమి దురాక్రమణకు గురి అయింది. జాల విగి వస్త్ర పరిశ్రమకు చెందిన భూములపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవా ప్రభుత్వం తలపెట్టిన భూముల అమ్మకాన్ని వెంటనే నిలిపి వేయాలి. ప్రభుత్వం న్యాయోచిత చర్యలు చేపట్టి భూములను కార్మికులకు అప్పగించాలి. భవనాన్ని కూల్చి నేతలో, భూ కబ్జాలో ప్రత్యేక్ష పరోక్ష భాగస్వామ్మం వున్న భూ దురాక్రమబాపై చట్టపర చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం వున్న స్థలంలో కార్మికుల భవనాన్ని నిర్మించి ఇన్నాలి.

ప్రబరాదా? కార్మికులారా అజం బహి మిల్లుకు సంబంధించిన భూములపై పూర్తి హక్కు కార్మికులకు లేదా వారి కుటుంబాలకు వర్తిస్తుంది. భూములపై హక్కులను సాదించుకునే వరకు విరోచిత పోరాటాలు చేపట్టండి. ప్రజలు మిత్రులు, మేధావులు ప్రజాస్వామికవాదులు కార్మికుల వైపు నిలబడి వారి పోరాటాలకు సంపూర్ణ మద్దతును తెలుపండి అని కోరారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మండల పరిధిలోని 9 ఎంపీటీసీ స్థానాల తుది వివరాలు విడుదల :ఎంపీడీవో సునీల్ కుమార్

పినపాక, నేటి గదర్ న్యూస్ : పినపాక మండల పరిధిలోని 9 ఎంపీటీసీ స్థానాల తుది జాబితా విడుదల చేశామని పినపాక ఎంపీడీవో సునీల్ కుమార్ తెలియజేశారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో ఆ జాబితా

Read More »

జంతువుల సంరక్షణకు అండర్ పాసులు నిర్మించాలి రేంజ్ అధికారి విద్యాసాగర్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 3:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో అటవీ రేంజ్ అధికారి కార్యాలయంలో సోమవారం నాడు స్థానిక విలేకర్లతో రామాయంపేట అటవీ రేంజ్ అధికారి విద్యాసాగర్ మాట్లాడుతూ

Read More »

శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేసిన మైనంపల్లి హనుమంతరావు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 3:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని శ్రీ పద్మావతి గోదాదేవి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పుష్కర బ్రహోత్సవాలు తొమ్మిది రోజుల పాటు జరగనున్నాయి.ఈ సందర్బంగా శ్రీ వెంకటేశ్వర

Read More »

లక్ష డప్పులు-వెయ్యి గొంతుల కార్యక్రమం గోడపత్రిక ఆవిష్కరణ

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 3:- తెలంగాణ రాష్ట్ర ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 7న హైదరాబాదులో జరిగే లక్ష డప్పులు-వెయ్యిగొంతులు అనే కార్యక్రమానికి సంబంధించి సోమవారం మెదక్

Read More »

శిశుమందిర్ పాఠశాలలో 56 మంది పిల్లలకు అక్షరాభ్యస కార్యక్రమం

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 3:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో శ్రీ అశోక్ సింఘాల్ శిశుమందిర్ లో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా శిశుమందిర్ లో పిల్లలకు సామూహిక

Read More »

ప్రజా సమస్యల కోసం ప్రజావాణి కార్యక్రమం తహసీల్దార్ రజనీకుమారి

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 3:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా తహసిల్దార్ రజనీకుమారి మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం

Read More »

 Don't Miss this News !