★చదువుకునే విద్యార్థినిలకు కరాటే నేర్చుకోవడం వల్ల భవిష్యత్ ఉంటుంది
నేటి గదర్ న్యూస్ ప్రతినిధి, ఖమ్మం : జాతీయ స్థాయి కరాటే పోటీలు ఆదివారం స్థానిక వర్తక సంఘం భవనం (ఛాంబర్ అఫ్ కామర్స్ కామర్స్ ) లో సైదులు కరాటే స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించారు . ఈ కార్యక్రమాన్ని ఖమ్మం 3 టౌన్ సిఐ టి రమేష్ ప్రారంభించగా ట్రాఫిక్ సీఐ-2 సాంబశివరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు . సాయంత్రం జరిగిన బహుమతి ప్రధానోత్స కార్యక్రమానికి తుమ్మల యుగంధర్ అన్న పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు . సుమారుగా 50 స్కూల్ నుండి 1000 విద్యార్థులు ఈ కరాటే పోటీలలో పాల్గొన్నారు . బ్లాక్ బెల్ట్ గ్రాండ్ ఛాంపియన్షిప్ గర్ల్స్ ఎస్కే రిజహర్ గెలుపొందగా , బాయ్స్ ఎస్.కె ఆదిల్ పాషా బ్లాక్ బెల్ట్ గ్రాండ్ ఛాంపియన్షిప్ కైవసం చేసుకున్నారు . ఈ యొక్క పోటీలకు న్యూ విక్టరీ టాలెంట్ హై స్కూల్ కరస్పాండెంట్ బొల్లా మోహన్ రెడ్డి , బొల్లా రమేష్ రెడ్డి లు సహాయ సహకారాలు అందజేశారు . ఈ కార్యక్రమంలో మాస్టర్స్ రాము , బాబు , గాఫుర్ , సందేశ్ , వీరన్న , ఖాసీం తో పాటు చాలామంది కరాటే మాస్టర్ లు పాల్గొన్నారు . ఈ సందర్భంగా వచ్చిన అతిథులు మాట్లాడుతూ చదువుకునే విద్యార్థినిలకు కరాటే భవిష్యత్ లో ఉపయోగపడుతుందని , ఇది శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని , చిన్నపిల్లలకు శారీరకంగా మరియు మానసికంగా అభివృద్ధి చెందడానికి అవకాశాన్ని అందిస్తుందని , కరాటే అనేది అన్ని వయసుల వారికి ఉపయోగపడే క్రమశిక్షణ , ఫిట్నెస్ నియమావళి మరియు ఆత్మరక్షణ యొక్క ఒక రూపమును పొందుపరుస్తుందని తెలిపారు .