కార్మిక, కర్షకులకు శాపం గా మారిన బిజెపి ప్రభుత్వ విధానాలు
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కార్మిక, కర్షక ,శ్రామిక ప్రజలకు వ్యతిరేకం
సిపిఐ ఎంఎల్ ప్రజా పంధా పార్టీ జిల్లా నాయకులు పోతుగంటి లక్ష్మణ్ డిమాండ్.
ములకలపల్లి: నేటిగద్దర్ న్యూస్.బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోర్టులను తక్షణమే రద్దు చేయాలని సిపిఐ ఎంఎల్ ప్రజా పంధా జిల్లా నాయకుడు పోతుగంటి లక్ష్మణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్ కే యం జాతీయ కమిటీ పిలుపులో భాగంగా సోమవారం సిపిఎం కార్యాలయంలో సిపిఎం, సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా, సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ,బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక కార్మిక విధానాలను వ్యతిరేకించాలని నిరసిస్తూ ఫిబ్రవరి 5న మండల కేంద్రంలోని జరిగే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. పెరిగిన నిత్యవసర ధరలకు అనుగుణంగా కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. మూడు నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని విద్యుత్ సంస్కరణ చట్టాన్ని సవరించాలని నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 1న కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్ లో 2025-26 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదలకు కార్మికులకు అట్టడుగు వర్గాలకు తిరోగమనంగా ఉందని అది దేశ అభివృద్ధి కి శాపంగా ఉండనుందని విమర్శించారు.ప్రజల జీవితాలకు, శ్రామికుల బతుకుదెరువుకు శాపంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదకరమైన విధానాలు అమలు జరిపేందుకు మరింత ప్రోత్సాహం ఉన్న ఈ బడ్జెట్ ను దేశ ప్రజలందరూ వ్యతిరేకించాలన్నారు. సరళీకృత ఆర్థిక విధానాలలో వేగంగా అమలుపరిచేందుకు ఊతమిచ్చేలా ఈ బడ్జెట్ రూపకల్పన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకే కేంద్రం సహకరిస్తామని బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం సరైనది కాదని, బడ్జెట్ లో కార్మికులకు రైతాంగానికి, వ్యవసాయ కార్మికులకు తీవ్ర అన్యాయం చేసిందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు వూకంటి రవికుమార్, నిమ్మల మధు, సిపిఐ ఎంఎల్ ప్రజాపంద నాయకులు యర్ర గొర్ల రామారావు, సత్రబోయిన వెంకటేశ్వర్లు, నకరికంటి నాగేశ్వరరావు, శనగని వినోద్, వేణు,తదితరులు పాల్గొన్నారు.