.
పినపాక,ఫిబ్రవరి 03:
పినపాక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గోపాలరావు పేట గ్రామంలోని క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న జర్నలిస్టు కప్ క్రికెట్ టోర్నమెంట్ ని సోమవారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం కాసేపు బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహ పరిచారు. అనంతరం వారు మాట్లాడుతూ పినపాక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలుగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయం అన్నారు. మండలంలోని అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతో కలిపి టోర్నమెంట్ నిర్వహించడం వలన అన్ని శాఖల ఉద్యోగుల మధ్య స్నేహపూర్వక సంబంధాలు నెలకొంటాయని అన్నారు. నిత్యం విధి నిర్వహణలో బిజీగా, ఒత్తిడిలో ఉండే ప్రభుత్వ ఉద్యోగులు ఇలాంటి క్రీడలలో పాల్గోనడం వలన మానసికంగా ప్రశాంతంగా ఉండవచ్చు అని అన్నారు. ప్రస్తుతం యువత క్రికెట్ క్రీడ పట్ల ఆసక్తి కలిగి ఉంటున్నారని అన్నారు. ఆదివారం జరిగిన మహిళల అండర్ 19 వరల్డ్ కప్ ని భారత జట్టు గెలుపొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మహిళల క్రికెట్ జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. వరల్డ్ కప్ టోర్నమెంట్ లో అద్భుత ప్రదర్శన కనబరిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ని సొంతం చేసుకున్న భద్రాచలం కి చెందిన క్రీడాకారిణి గొంగడి త్రిషను ప్రత్యేకంగా అభినందించారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో జన్మించి పట్టుదలతో అంతర్జాతీయ స్థాయిలో మన జిల్లా పేరును నిలబెట్టడం పట్ల జిల్లా ప్రజల తరపున శుభాకాంక్షలు తెలిపారు. యువత చదువు తో పాటు క్రీడలలో రాణించడం వలన పుట్టి పెరిగిన గ్రామాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గొడిశాల రామనాథం, ప్రెస్ క్లబ్ సభ్యులు బిల్లా నాగేందర్, భూరా శంకర్, కీసర సుధాకర్ రెడ్డి, సనప భరత్, ముక్కు మహేష్ రెడ్డి, కట్టా శ్రీనివాసరావు,కొంపెల్లి సంతోష్, గాడుదల దిలీప్, నగేష్, కోటి, జగదీష్, సాయి ప్రకాష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గొపాలరావుపేట గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.