రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి1:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ఉన్న జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల గత సంవత్సరం 2024 లో భారీ వర్షాలకు పూర్తిగా శిధిలావస్థకు చేరి పైకప్పు పెచ్చులూడుతూ కూలుతోంది.అందుకు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఉన్న బిసి హాస్టల్ భవనంలోకి పాఠశాల భవనాన్ని మార్చడానికి సేహగల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరమ్మతు పనులు చేయడానికి శ్రీకారం చుట్టారు.2024 సెప్టెంబర్ 19న జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు,జిల్లా విద్యాశాఖ అధికారి రాధా కిషన్ పున:నిర్మాణం మరమ్మతు పనులను ప్రారంభించారు.ఈ నేపథ్యంలో బాలుర పాఠశాలలో మరమ్మతు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.2025 మార్చి నాటికి పున:నిర్మాణం మరమత్తు పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నారు.
Post Views: 90