రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి1:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని పెద్దమ్మ దేవాలయంలో ప్రేమ జంటకు వివాహం జరిగింది.ఇరు కుటుంబాల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన మామిడాల వినయ్,రామాయంపేట పట్టణానికి చెందిన మర్రికింది రేవతి గత రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు.అప్పటినుండి వినయ్ నుండి సరైన స్పందన లేకపోవడంతో,శనివారం రేవతి రామాయంపేట పోలీసులను ఆశ్రయించింది.ఇరు కుటుంబాల సభ్యులను పిలిచి రామాయంపేట ఎస్సై బాలరాజ్ కౌన్సిలింగ్ చేశారు.ఇరు కుటుంబాల ఒప్పందం మేరకు పెద్దలు రామాయంపేట పట్టణంలోని పెద్దమ్మ దేవాలయం వద్ద ఘనంగా వివాహం జరిపించారు.
Post Views: 312