హావేళ్ళి ఘణపూర్ మండలం (మెదక్ రూరల్) నేటి గదర్ ప్రతినిధి ఫిబ్రవరి 28.
మెదక్ జిల్లా హవేళి ఘణపూర్ మండలం సర్ధన గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్ రాజేశ్వరరావు తండ్రి సర్వోత్తమ్ రావు శనివారం మరణించారు. విషయం నాయకులు ద్వారా తెలుసుకున్న మెదక్ జిల్లా బిఆర్ ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే యం.పద్మ దేవేందర్ రెడ్డి ఆదివారం సర్ధన గ్రామానికి వెళ్లి రాజేశ్వర్ రావు ను వారి తల్లి రుకుంబాయ్ ని పరామర్శించి మనో ధైర్యాన్ని తెలిపారు.వీరి వెంట మెదక్ జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షురాలు యం. లావణ్య రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ రాధాకృష్ణ యాదవ్,మండల నాయకులు సతీష్ రావు,సాప.సాయిలు తదితరులు ఉన్నారు.
Post Views: 45