నేటి గద్దర్ న్యూస్, ఫిబ్రవరి, 02: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం, పట్వారి గూడెం గ్రామంలో ఎస్సి వర్గీకరణ అమలుకై మందా కృష్ణ మాదిగ అన్న తలపెట్టిన వేల గొంతులు-లక్ష డప్పులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ వాల్ పోస్టర్ నీ స్థానిక ఎమ్మార్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో తుడుం దెబ్బ నాయకులు ఆవిష్కరించడం జరిగినది, మందకృష్ణ మాదిగ అన్నా చేస్తున్నటువంటి ఉద్యమానికి తమ తరుపునుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని, వారు తలపెట్టిన వేల గొంతులు-లక్ష డప్పులు కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తంబల్ల రవి కోరారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ రాష్ట్ర నాయకులు బండారు సూర్యనారాయణ, దారబోయిన రమేష్ ఎంఆర్పిఎస్ నాయకులు కోలికపోగు కాంతారావు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 34