నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఫిబ్రవరి, 02: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణకి చాలా నష్టం జరిగిందని అశ్వరావుపేట నియోజకవర్గం బిఆర్ఎస్ నాయకులు జిల్లా నాయకులు ఆదివారం మీడియా సమావేశంలో తెలియజేశారు. దక్షిణ భారతదేశమంటేనే మొదటి నుండి బీజేపీకి చిన్నచూపనీ, గతంలో కూడా దేశంలో 142 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్క కాలేజీ ఇవ్వలేదనీ, మెడికల్ పీజీ విషయంలో కూడా ఇదే జరిగిందనీ, దక్షిణాదిలో రాష్ట్ర ప్రభుత్వాలే నిధులు పెట్టుకొని కాలేజీలు, ఆస్పత్రులు నడుపుతుంటే, ఇప్పుడు మెడికల్ కాలేజీ సీట్లలో 50% స్థానిక కోటా ఉండదు అంటే తీవ్ర అన్యాయం చేయడమే అని, తెలంగాణ నుండి ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది బిజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నా, అయినా బడ్జెట్ లో రాష్ట్రానికి సాధించింది ఏం లేదనీ రెండు జాతీయ పార్టీలు తెలంగాణ ప్రయోజనాలు కాపాడటంలో దారుణంగా ఫెయిల్ అయ్యాయి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధికార ప్రతినిధి ప్రకాష్ మాస్టర్, నియోజవర్గ యువజన భాగంగా అధ్యక్షుడు మోహన్, మాజీ ఎంపీపీ శ్రీరామ్ మూర్తి, టౌన్ అధ్యక్షుడు సంపూర్ణ, తాళం సూరి, శ్రీరామ్ మూర్తి, బజారయ్య చరణ్ తదితరులు పాల్గొన్నారు.