నేటి గదర్ న్యూస్,పినపాక(మణుగూరు): పిడుగుపాటుకు గురై మృతి చెందిన గిరిజన రైతు,
రేగుల గండి గ్రామం నివాసి కుంజా జగన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి సత్రపెల్లి సాంబశివరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జగన్ మృతితో భార్య, నలుగురు పిల్లలు అనాధలు అయ్యారని… ప్రభుత్వం, ఐటీడీఏ తక్షణమే స్పందించి మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని అన్నారు.
Post Views: 71









