★దాని వల్ల ఉపయోగం లేదు
★ సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ,కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
నేటి గదర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: ప్రపంచంలోనే పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాలేశ్వరం ప్రాజెక్టు పై సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఘాటుగా కామెంట్ చేశారు.హనుమకొండ జిల్లా పర్యటనలో కూనంనేని సాంబశివరావు ఈ వ్యాఖ్యలు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు, రద్దు చేయాలి అని తన మిత్రపక్ష పార్టీకి మద్దతుగా మాట్లాడారు. మాజీ సీఎం
కెసిఆర్ తన రక్తపు బొట్టు కరిగించి, మెదడు కరిగించి కట్టానన్నారు. ఇప్పుడేమో అధికారులు కట్టారంటున్నారు.
కొంతమంది కేసీఆర్ అంటే కాళేశ్వరం, కాళేశ్వరం అంటే కేసీఆర్ అన్నారు. ఇప్పుడేమో మాట మారుస్తున్నారు అని ఎద్దేవ చేశారు
హరీశ్ రావు.. పర్మిషన్ ఇవ్వకపోతే జనాలను ముంచే ప్రాజెక్టులు కడతారా? అని గత పాలకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఎంతో కత్తితో కూడుకున్న కాలేశ్వరం ప్రాజెక్టును రద్దు చేయాలని అదే తమ పార్టీ అభిప్రాయం అని అన్నారు. కూనంనేని మాటలపై బీ ఎస్ ఎస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో వెయిట్ చేయాల్సిందే మరి.









