ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కై పోరాడండి…
సిపిఎం వైరా డివిజన్ స్థాయి విస్తృత సమావేశంలో భూక్యా వీరభద్రం ఫిలుపు.
నేటి గదర్ న్యూస్, వైరా:
కామేపల్లి :వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో సిపిఎం పోటీ చేస్తుందని, గెలుపే లక్ష్యంగా సిపిఎం శ్రేణులు కృషి చేయాలని సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం పిలుపునిచ్చారు. కామేపల్లి మండలం లింగాల క్రాస్ రోడ్ ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ లో జరిగిన సిపిఎం వైరా డివిజన్ స్థాయి విస్తృత సమావేశం జిల్లా కమిటీ సభ్యులు దుగ్గి కృష్ణ అధ్యక్షతన జరిగింది. స్థానిక సంస్థలకు ప్రభుత్వాలు సకాలంలో ఎన్నికలు జరపకుండా కాలయాపన చేయడంతో పాలకవర్గాలు లేక ప్రజలు సమస్యలతో సతమతం అవుతున్నారని, గ్రామాలలో ఉన్న స్థానిక సమస్యలపై సిపిఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటం నిర్వహించి ప్రజల పక్షాన నిలబడి పోరాడాలని అత్యధిక స్థానాలు గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కోరారు, ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా తిరిగి ప్రజల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. రైతుల సమస్యలు, పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అందించాలని డిమాండ్ చేశారు, ప్రజాక్షేత్రంలో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన కోరారు. రాజకీయ శిక్షణ తరగతులు ముగింపు సందర్భంగా మతం మతోన్మాదం అంశం రాజకీయ విద్యా విభాగం జిల్లా బాధ్యులు బోడపట్ల రవీందర్, సోషల్ మీడియా లో సిపిఎం కృషి అంశం జిల్లా కమిటీ సభ్యులు పారుపల్లి ఝాన్సీ కుమారి బోధించారు. సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు మెరుగు సత్యనారాయణ, తాళ్లపల్లి కృష్ణ సుంకర సుధాకర్, కొండబోయిన నాగేశ్వరావు, దొంతబోయిన నాగేశ్వరావు, కే నరేంద్ర, చింతనప్పు చలపతిరావు, బాణాల శ్రీనివాసరావు,మచ్చా మణి, అంబటి శ్రీనివాస్ రెడ్డి చేరుకుమల్లి కుటుంబ రావు, బాదవత్ శ్రీనివాస్, అడప ఉపేందర్, రాయల సత్యనారాయణ,హుస్సేన్ మంగిలాల్ తదితరులు పాల్గొన్నారు.









