+91 95819 05907

వెలుగుమట్లలో భూదాన్ భూముల బాధితులకు అక్కడే పట్టాలి ఇచ్చి, ఇండ్లు నిర్మించి ఇవ్వాలి ___ ఆర్.పి.ఐ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నకరికంటి

వెలుగుమట్లలో భూదాన్ భూముల బాధితులకు అక్కడే పట్టాలి ఇచ్చి, ఇండ్లు నిర్మించి ఇవ్వాలి

___ ఆర్.పి.ఐ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నకరికంటి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం :
ఖమ్మం జిల్లా కేంద్రం వెలుగుమట్ల ప్రాంతంలో గత పది సంవత్సరాలుగా నివాసం ఉంటున్న నిరుపేదల గుడిసెలను బలవంతంగా కూల్చివేయడం దుర్మార్గమైన, హేయమైన చర్య. భూదాన్ భూముల్లో పేదలు నిర్మించుకున్న ఇళ్లను ధ్వంసం చేసి, భారీ పోలీసు బలగాలతో రెవెన్యూ యంత్రాంగం ఖాళీ చేయించడం మానవ హక్కుల ఉల్లంఘనగా రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ( ఆర్.పి.ఐ అత్త వాలే )
పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నకరికంటి సంజీవరావు అభివర్ణిస్తూ తీవ్రంగా ఖండించారు .
ప్రజా పాలన, ఇందిరమ్మ రాజ్యం అనే ముసుగులో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలపై దౌర్జన్యానికి పాల్పడటం అన్యాయం. రాజ్యాంగబద్ధంగా ప్రతి మనిషికి జీవించే హక్కు ఉంది. భూదాన్ భూములపై ప్రభుత్వానికి ఏకపక్ష హక్కులు లేవు. పది సంవత్సరాలుగా అక్కడ నివసిస్తున్న పేదలను రోడ్డున పడేయడం అమానుషం
అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేసి, భూదాన్ భూముల్లోనే పేదలకు అక్కడే పట్టాలి ఇచ్చి, శాశ్వత గృహ నిర్మాణం చేపట్టి ,అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి. నిరాశ్రయులైన కుటుంబాలకు తక్షణమే తగిన నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి అన్నారు.
పేదల పక్షాన ఆర్.టి.ఐ (అతేవాలే) పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తుంది. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నకిరికంటి సంజీవ రావు తెలిపారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 31.07 కుంటల భూదాన్ భూమి మొత్తం కబ్జా అయినట్లు ఉందని , ఇది పేదలకే అప్పగించాలని కోరారు. ఈ విషయంపై తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు , కేంద్రమంత్రి
ఆతావాలే దృష్టికి తీసుకెళ్లగా ఆయన కూడా పేదలకు అక్కడే భూములు పట్టాలిచ్చి , ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పడం జరిగిందని నకరికంటి సంజీవరావు తెలిపారు . వెలుగుమట్ల సందర్శన కూడా ఆయన సానుకూలంగా స్పందించినట్టు ప్రకటించారు. కాగా ఈ భూముల విషయంలో అక్కడ ఉన్న సర్వే పక్కన ఉన్న సర్వే ఇతర ఖాళీగా ఉన్న భూముల విషయంలో కూడా దృష్టి సారించి , ప్రభుత్వానివా , ప్రైవేటు వా ? అనేది కూడా నిర్ధారించాలని సూచించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

అశ్వారావుపేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే నా లక్ష్యం: ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

ములకలపల్లి మండలంలో సుడిగాలి పర్యటన.. కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, చెక్కుల పంపిణీ. నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) ఫిబ్రవరి, 28: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం,

Read More »

అమర జవాన్ కేశవరెడ్డికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు

​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఫిబ్రవరి 28: దేశ సేవలో తరించిన ఆర్మీ జవాన్ మారం కేశవరెడ్డి మృతి తీరని లోటని, వారి త్యాగం మరువలేనిదని అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, మాజీ ట్రైకార్

Read More »

ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

నేటి గదర్ న్యూస్,చింతకాని ప్రతినిధి : మండల పరిధిలోని నాగులవంచ గ్రామంలోని ఆరో వార్డులో గ్రామ సర్పంచ్ నారగాని రాంబాయి, గ్రామ కార్యదర్శి చిరంజీవి, ఆరవ వార్డు సభ్యులు గంధం ఇందిర ఆధ్వర్యంలో ముమ్మరంగా

Read More »

ఆర్ అండ్ బి అధికారులు.. *ప్రజల ప్రాణాలను కాపాడండి..!

* నేటి గదర్ న్యూస్,చింతకాని ప్రతినిధి : ఖమ్మం- బోనకల్ ప్రధాన రహదారి అయిన మత్కేపల్లి బస్ స్టాప్ వద్ద ముదిగొండ మండలానికి,జగన్నాధపురం గ్రామానికి మరియు చింతకాని మండలానికి వెళ్లే రింగ్ వద్ద నూతనంగా

Read More »

మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ను పరిశీలించిన సర్పంచ్ పొడుగు పెంటయ్య

మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ను పరిశీలించిన సర్పంచ్ పొడుగు పెంటయ్య కరపల్లి నేటి గద్దర్ న్యూస్ ప్రతినిధి సుమంత్ కారేపల్లి మండలం మొట్లగూడెం చింతలపాడు గ్రామ పంచాయతీ మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్

Read More »

 Don't Miss this News !