*నీలం మధు మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించిన*
మెదక్ జిల్లా BJP అధ్యక్షులు వాళ్దాస్ రాధామల్లేష్ గౌడ్
నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 26.
మెదక్ జిల్లా నర్సాపూర్ అసెంబ్లీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు వాళ్దాస్ రాధామల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. జిల్లా అధ్యక్షులు వాళ్దాస్ రాధామల్లేష్ గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ నీలం మధు మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఎంపీ రఘునందన్ రావు ని విమర్శించే స్థాయి నీలం మధుకి లేదు ఒక బీసీ బిడ్డ అయ్యి ఉండి ఎన్నో పార్టీలు మారుతూ ఎప్పుడు అధికార దాహం కోసం ఎదురుచూస్తున్న నీలం మధు ముదిరాజు బిడ్డను ఓడ కొట్టారని చెప్పడం అస్పథము. ఎప్పుడు కూడా ముదిరాజులను ప్రోత్సహించని నీలం మధు కెసిఆర్ కు కేటీఆర్ కు కొన్ని రోజులు వత్తాసు పలికి ఇప్పుడు రేవంత్ రెడ్డికి మోకరిల్లుతున్న నీలం మధు బీసీ బిడ్డ అయ్యుండి కాటం శ్రీనివాసును ఓడకొట్టి అన్ని పదవులు నాకే అంటూ సర్పంచ్ నాకే కౌన్సిలర్ నాకే ఎమ్మెల్యే నాకే ఎంపీ నాకే అని అన్ని టికెట్లు నీలం మధు తీసుకొని ఏ బిసి బిడ్డను కూడా ఎంకరేజ్ చేయకుండా బీసీలకు అన్యాయం చేసిన నీలం మధు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సంఘసాని సురేష్ మున్సిపల్ వైస్ చైర్మన్ భూచేష్ యాదవ్ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కొండల్ రావు జిల్లా కోశాధికారి ఆంజనేయులు గౌడ్ సీనియర్ నాయకులు నర్సారెడ్డి జిల్లా గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి రాములు నాయక్ నూతన కౌన్సిలర్ నిరంజన్ దాస్ బిజెపి నాయకులు నగేష్ గౌడ్ శ్రీనివాస్ ప్రేమ్ రాకేష్ గౌడ్ రాజు బాలరాజు సంజీవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.









